‘కుల గణనను జాగ్రత్తగా నిర్వహించాలి’

ప్రధాని మోదీకి బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లేఖ రాశారు. ఆ లేఖలో కులగణన గురించి ప్రస్తావిస్తూ.. మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఓ మార్పును తీసికొచ్చే క్షణం కులగణన అని ఆయన పేర్కొన్నారు. కులగణన కేవలం డేటా కాదని, అనేక మంది ఆర్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని ప్రధానికి సూచించారు.