పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
WNP: వనపర్తి మండలం రాజపేటలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఆదివారం పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ ఎల్లన్న, ఉపసర్పంచ్ చిన్నారెడ్డి ఘనంగా సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల కృషి వెలకట్టలేనిదని, వారిని గౌరవించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాఘవేంద్ర, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజు తదితరులున్నారు.