సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
ATP: సెట్టూరు మండలం బొచ్చుపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ఇవాళ శక్తి టీం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలకు సంబంధించిన వీడియోలను విద్యార్థులకు ప్రదర్శించామన్నారు. మహిళలు,చిన్నారులపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు.