VIDEO: 'స్వేచ్ఛ హక్కును ప్రభుత్వం కాలరాస్తోంది'
GDWL: రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని, రాజకీయ పార్టీని ఎంచుకునే హక్కు ఉందన్నారు.