ఓటరు స్లిప్ అందలేదా.. ఇలా చేయండి..!
VKB: ఓటరు చీటీ పొందని వారికి ఎన్నికల సంఘం మరో సదావకాశాన్ని కల్పించింది. జిల్లా, గ్రామం, వార్డు, గుర్తింపు (ఎపిక్) కార్డు నంబరు వివరాలతో https://tsec.gov.in/voterSlipRural.do వెబ్ పోర్టల్ లేదా tepoll యాప్ నుంచి మీ ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. వెంటనే చీటీని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఓటు హక్కును వినియోగించుకోండి.