IPS అధికారి సంజయ్ రిమాండ్ పొడిగింపు
AP: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ రిమాండ్‌ను కోర్డు పొడిగించింది. ఇవాళ్టితో ఆయన రిమాండ్ గడువు ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం నవంబర్ 14 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.