VIDEO: పుట్టలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
ఎన్టీఆర్: కొండపల్లి పుట్టలమ్మ గట్టు వద్ద గల శ్రీ పుట్టలమ్మ తల్లి, శ్రీ మారెమ్మ తల్లుల నూతన ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య పాల్గొని, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిపారు.