సైబర్ నేరాలపై అవగాహన

ELR: ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని, రూబిక్ పాఠశాలలో మహిళా భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై సోమవారం విస్తృతమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, డయల్ 112 అత్యవసర సేవ గురించి విద్యార్థులకి వివరించారు. మహిళలు తమను తాము రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటివి వివరించారు.