సూర్యపేట జిల్లాకు వ్యవసాయ కాలేజీ రాక

సూర్యపేట జిల్లాకు వ్యవసాయ కాలేజీ రాక

SRPT: రాష్ట్రంలో మరో కొత్త అగ్రికల్చర్ (వ్యవసాయ) కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కళాశాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అగ్రికల్చర్ కాలేజీకి ఐకార్ నిబంధనల మేరకు 75 ఎకరాల భూమి అవసరం కాగా.. 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉంది.