జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న 'మదర్ మిల్క్ బ్యాంక్'

KMM: తల్లిపాలు సృష్టిలో అత్యంత శ్రేష్టమైనవి అని అప్పుడే పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఎంతో అవసరం. కానీ చాలా మంది తల్లుల్లో పాలు లేక బిడ్డలకు పోతపాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అలాంటి వారి కోసం ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 'మదర్ మిల్క్ బ్యాంక్' సత్ఫలితాలనిస్తుంది. ఇప్పటి వరకు 3,377 మంది తల్లులు పాలు ఇవ్వగా.. 8,090 మంది పిల్లలకు ప్రయోజనం చేకూరింది.