నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
RR: అత్తాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మీరాలం ఏడీఈ వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉండనుంది. కేశవ్ నగర్, కృష్ణ నగర్, శివనగర్, మోర్ సూపర్ మార్కెట్, గుమ్మకొండకాలనీ, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, సోమిరెడ్డి నగర్, లక్ష్మీ నగర్, నందనవనం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.