ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్

KMR: బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యల గురించి ప్రశ్నించడానికి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ని గెలిపించవలసిందిగా ఓటర్లకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గంగారం, ఎంపీపీ సుజాత పాల్గొన్నారు.