తీవ్ర ఎండల నేపథ్యంలో వ్యక్తి మృతి
BDK: పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మునిగేలా వెంకటేశ్వర్లు అనే రైతు బుధవారం గేదెలు మేపుకొని ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆయన ప్రాణాలు విడిచారు. తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ తగిలి మరణించారా లేదా అన్నది వైద్యులు నిర్ధారించాలని అన్నారు.