అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
KNR: అప్పులు బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండికి చెందిన కటుకటం శరత్ చంద్ర KNRలో నివాసం ఉంటున్నాడు. గతంలో బట్టల వ్యాపారం పెట్టి నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చడానికి పలు యాప్స్‌లోనూ లోన్ తీసుకున్నాడు. అయినప్పటికీ అప్పులు తీరకపోవడంతో బుధవారం చొప్పదండిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.