VIDEO: నిర్లక్ష్యానికి గురవుతున్న వేణుగోపాల స్వామి ఆలయం

VIDEO: నిర్లక్ష్యానికి గురవుతున్న వేణుగోపాల స్వామి ఆలయం

కోనసీమ: రావులపాలెం వేణుగోపాల స్వామి ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం చీమల పుట్టలు, నిలిచిన నీటితో దోమలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.