అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

MDK: తూప్రాన్ పరిధి రావెల్లిలో బొల్లెబోయిన అనిల్ (30) ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆటో నడిపిస్తూ జీవనం సాగించే అనిల్‌కు అప్పులు పెరిగిపోయాయి. అప్పుల విషయంలో భార్యతో సోమవారం రాత్రి గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. శివార్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, మంగళవారం గుర్తించారు. శవాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.