'మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత'

'మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత'

BHPL: కాటారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయంలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ఛైర్పర్సన్ పంతకాని తిరుమల-సమ్మయ్య, డైరెక్టర్లతో కలిసి వివిధ రకాల మొక్కలు నాటారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి షరీఫ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.