తిరుపతి రైతులకు నేడు నగదు జమ
TPT: తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుందని తెలిపారు.