10.40 అడుగులకు కొనసాగుతున్న నీటిమట్టం

KKD: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గురువారం సాయంత్రానికి 10.40 అడుగులకు నీటిమట్టం కొనసాగుతున్నట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. అలాగే తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 14,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. 4,52,898 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు.