చెత్త కుప్పలో పసికందు మృతదేహం లభ్యం
KMR: బాన్సువాడ మండలం దేశాయి పేట్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపేటలో సొసైటీ పక్కన ఉన్న చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసికందును పడేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పసిబిడ్డ పూర్తిగా కాలిపోయి, నలుపురంగుగా మారిన స్థితి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.