కారు బైక్, ఢీ.. ఒకరి మృతి
VKB: నవాబుపేట మండలం, మైతాబ్ ఖాన్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మోమిన్‌పేట మండలం, దేవరపల్లికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు కూడా అదే గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.