లారీ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు

లారీ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు

JGL: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కథలాపూర్ మండలం నుంచి ఆర్మూరు వైపునకు TS02UC2799 నంబర్ గల లారీలో ఇసుకను తరలిస్తున్న బోధన్‌కు చెందిన డ్రైవర్ షేక్ జాబు పాషా, యజమాని మహ్మద్ నయీమొద్దీన్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.