VIDEO: పాఠశాలలో MEO, విద్యార్థుల వందేమాతర గీతం
SRD: కంగ్టి మండలం టీ.వడగామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంఈఓ రహీముద్దీన్, పాఠశాల హెచ్ఎం టీచర్లు విద్యార్థులతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. పాఠశాలలతో పాటు, ప్రధాన కూడళ్లలో కూడా ప్రజలు వందేమాతర గీతాన్ని ఆలపించారు.