పంట బీమా చేయించుకోండి: ఏవో రామమ్మ

పంట బీమా చేయించుకోండి: ఏవో రామమ్మ

PLD: మాచవరం మండలం పిల్లుట్ల, సింగరాయపాలెం తండా గ్రామాల్లో మంగళవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామమ్మ రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని సూచించారు. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఆమె రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి అంజలి పాల్గొన్నారు.