VIDEO: ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో పోలీసుల తనిఖీలు
ప్రకాశం: కంభం పట్టణంలోని ప్రధాన రహదారులపై ఎస్సై శివకృష్ణ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుల పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను ఆయన తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.