పేదలకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే భాష్యం
PLD: అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నూతనంగా ప్రారంభమైన అమరావతి అన్న క్యాంటీన్‌లో సోమవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేదలకు అన్నం వడ్డించారు. నిరుపేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన అన్నం అందేలా అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. పేద బడుగు బలహీనవర్గాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.