కొత్త కారు కొన్న శర్వానంద్.. ధర తెలిస్తే షాక్..!
యంగ్ హీరో శర్వానంద్ హై-ఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 'MPV Lexus LM 350h' కారును కొనుగోలు చేసి, షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 8.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగల ఈ కారు, గరిష్టంగా 190 kmph వేగంతో ప్రయాణించగలదు. దీని ధర సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.