శ్రమదానంతో గ్రామ పరిశుభ్రత

శ్రమదానంతో గ్రామ పరిశుభ్రత

 AKP: ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో గ్రామస్తులు పలువురు ముందుకు వచ్చి శ్రమదానంతో ఆదివారం తుప్పలు, వ్యర్థాలను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రం చేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ కె. విజయరామరాజు, టీడీపీ మండల యూనిట్ ఇన్‌ఛార్జ్ వెంకునాయుడు ఆధ్వర్యంలో ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహిస్తున్నారు.