ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

HNK: ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA కడియం శ్రీహరి హాజరై, పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించారు. MLA మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం పోరాడిన పాపన్న గౌడ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.