సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలు
HYDలో సీసీ కెమెరాల నిర్వహణకు, వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి పోలీసులు 'ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్' అనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్లకు వాహనాలు, క్రేన్లు, ఇతర సామగ్రిని కూడా సమకూర్చారు. ఈ ప్రత్యేక బృందాలు ఇకపై నిరంతరాయంగా సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించి, నగరాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.