పేదలకు ఆర్థిక సాయం అందజేత

KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటపల్లె గ్రామ సమీపంలో ఉన్న జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం సంస్థ అధ్యక్షుడు ఖారీ అబ్దుల్ సుబహాన్ పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆపద కష్టాల్లో ఉన్న పేదలకు సంస్థ తరఫున కృషి చేస్తూనే ఉంటామన్నారు. అనంతరం ప్రతినెలా అనారోగ్యంతో బాధపడే పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.