VIDEO: ఘనంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం

VIDEO: ఘనంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం

NZB: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ శివారులో గల శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ఆర్మూర్, పెర్కిట్ పురవీధుల్లో రథోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ వేడుకను వీక్షించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.