నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KKD: ప్రత్తిపాడు మండలంలో 11KV శాంతి ఆశ్రమం ఫీడర్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జగ్గంపేట ఈఈ బి. వీరభద్ర రావు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శాంతి ఆశ్రమం, వెంకటనగరం, యూజే పురం, వాకపల్లి, పోతులూరు గ్రామాల్లో కరెంట్ ఉండదన్నారు. కొత్త RDSS లైన్ల ఏర్పాటు, మరమ్మతులు, చెట్ల తొలగింపు పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందన్నారు.