విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బాల్క సుమన్
MNCL: చెన్నూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో ఆత్మహత్య చేసుకున్న శ్రీహిందు అనే విద్యార్థిని కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.