భూపాలపట్నం గ్రామ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం
ASF: సిర్పూర్ (టి) మండలం భూపాలపట్నం గ్రామ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. సర్పంచ్ స్థానానికి గాను రాజారం అనే వ్యక్తి ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామస్థులు అందరు సమావేశమై ఆయనను ఏకగ్రీవం చేశారు. తనపై గ్రామస్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాజారం తెలిపారు.