సత్తుపల్లి గతంలో కంటే కాస్త పెరిగిన పోలింగ్

సత్తుపల్లి: ఖమ్మం లోకసభ ఎన్నికలు-2024 నేపధ్యంలో సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 80.34శాతం పోలింగ్ నమోదవ్వగా గతంలో నమోదైన 78.05శాతం (2019) కంటే స్వల్పంగా 2.29% పోలింగ్ పెరిగింది. 2019లోకసభ ఎన్నికల్లో 2,30,508మంది ఓటర్లకు గానూ 1,79,928మంది ఓట్లు వేశారు. ప్రస్తుత లోకసభ సాధారణ ఎన్నికల్లో 2,43,943 మందికిగానూ 1,95,979 ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.