పేదలకు పట్టాలు ఇవ్వాలి: ఎమ్మెల్సీ

పేదలకు పట్టాలు ఇవ్వాలి: ఎమ్మెల్సీ

WGL: వరంగల్ జక్కలొద్ది భూముల అంశంపై శాసన మండలిలో శనివారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడారు. భూముల కబ్జాపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. వరంగల్, హనుమకొండ, వర్ధన్నపేట ప్రాంతాలకు చెందిన నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు. గుడిసెలను పరిశీలించి అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చేలా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.