'యూరియాను దారి మళ్లిస్తే చర్యలు తప్పవు'

'యూరియాను దారి మళ్లిస్తే చర్యలు తప్పవు'

ELR: యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారిమళ్లిస్తే దుకాణా యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. జిల్లాలో అవసరమైన అన్ని ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.