బీజీపీ నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డు బీజేపీ నూతన కార్యవర్గాన్ని సోమవారం సాయంత్రం ఎన్నుకున్నారు. 15వ వార్డ్ బీజేపీ అధ్యక్షుడిగా తుల రాములు, ఉపాధ్యక్షులుగా కొలిమి గోపాల్ రెడ్డి, రాజు, ధూమాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా రోండ్ల సుధాకర్ రెడ్డి, కార్యదర్శిగా మాసుల గంగాధర్ యాదవ్‌లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.