చేతి వృత్తిదారులకు వృత్తి నైపుణ్య శిక్షణ

SKLM: హిరమండలం పంచాయతీ పరిధిలోని సుభలయ, పాత హిరమండలం, మేదర్ వీధిల్లో నాబార్డ్ జిల్లా డెవలప్‌మెంట్ మేనేజర్ కె.రమేష్ కృష్ణ పర్యటించి చేనేత,మేదర, కుమ్మరి, కమ్మరి చేతి వృత్తి కుటుంబాలు కలిశారు. అతి తక్కువ కాలంలో వృత్తుల వారిగా శిక్షణ ఇచ్చి నైపుణ్య మెలకువలు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఖాదీ గ్రామీణ పరిశ్రమ డైరెక్టర్ శివప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.