రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NZB: ఇందల్వాయి మండలం దేవి తండా వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఆగి ఉన్న లారీకి కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన నర్సింహారెడ్డి, విశాల్ కారులో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, విశాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.