బాధితుడికి సీఎం సహాయనిధి అందజేత

బాధితుడికి సీఎం సహాయనిధి అందజేత

PLD: చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రుకు చెందిన మట్టకోయ మాధవరావు చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.89,766 మంజూరయ్యాయి. ఈ ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బాధితుడి కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందిని ఆదుకుంటున్నామని ఆయన తెలిపారు.