'GVMC వార్డుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి'

'GVMC వార్డుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి'

VSP: విశాఖ జీవీఎంసీ వార్డుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో మధురవాడ, భీమిలి జోనల్ కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. రోడ్లు, డ్రైనేజీలు, హౌసింగ్ వంటి సమస్యల పరిష్కారానికి మున్సిపల్ మంత్రి నారాయణ త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.