అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం
PPM: జాతీయ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక అగ్నిమాపక కేంద్రంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించి, పరికరాల వినియోగం, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు.