'అప్పుల భారం మోపినా హామీలు అమలు చేస్తున్నాం'
NGKL: గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుల భారం మోపినా రాజీ పడకుండా హామీలను అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ...ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.