VIDEO: గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు కార్తీక పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలిపెట్టారు. గోదావరి తీరంలో భక్తులు సైకత లింగాలు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.