తహసీల్దార్ కార్యాలయనికి సూమారు 110 ఏళ్లు
జనగామ తహసీల్దార్ కార్యాలయ నిజాం కాలంలో నిర్మించిన భవనం 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ సేవలు అందిస్తున్న ఈ భవనం, నాటి నిర్మాణ నాణ్యతకు అద్దం పడుతోంది. ఇక్కడ కనిపించే '1325- ఫసలీ' బోర్డు ప్రకారం, ఫసలీ సం" ఆంగ్ల సంవత్సరం కంటే 590 ఏళ్లు వెనుకబడి ఉంటుంది. అంటే ఈ భవనం సుమారు 1915లో నిర్మించినట్లు చరిత్రకారులు తెలిపారు.