VIDEO: గురజాలను కమ్మేసిన పొగ మంచు
PLD: గురజాల మండలం గంగవరం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కురిసింది. మంచు కారణంగా స్కూలు బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరగా వచ్చే వరకు కనిపించకపోవడంతో విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు బయపడుతున్నారు.