VIDEO: 'రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

BHPL: కాటారం మండల కేంద్రంలో మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పశువులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఛైర్‌పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య మాట్లాడుతూ.. రైతులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.