పెంచలకోన దేవస్థానం ఈఓగా కోవూరు జనార్దన్ రెడ్డి
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా కోవూరు జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈవోగా పని చేస్తున్న శ్రీనివాసులు రెడ్డి సెలవు పెట్టి వెళ్లడంతో జిల్లా దేవాదాయ శాఖ ఏసీ జనార్దన్ రెడ్డిను నియమించారు. అనంతరం ఆయన లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.